మచిలీపట్నం :
స్థానిక చిట్టిపిళ్ళారయ్య దేవాలయంలో శనివారం రాత్రి జరిగిన భువన విజయం నాటక ప్రదర్శన అందరినీ అలరించింది.ఆగమ విద్వాంసులు విష్ణుభట్ల సూర్యనారాయణ ఘనపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహిత్య రూపకం సాహిత్య ప్రియులకు ఆనందం కలిగించింది.
చిన్నారులు మల్లాప్రగడ అభిరామ్, భట్టిప్రోలు మేథ చేసిన ప్రార్థనతో ప్రారంభమై, కుమారి జెల్లూరి శరణ్య నృత్య ప్రదర్శనతో, అల్లాడ శ్యామలత సుమధురగానంతో సభ పులకించింది.
రాయలుగా బృందావనం ధన్వంతరి ఆచార్య, తిమ్మరుసుగా ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, పెద్దనగా మద్దూరి రామమోహనరావు, నందితిమ్మనగా దండిభట్ల దత్తాత్రేయశర్మ, మాదయగారి మల్లనగా కారుమూరి రాజేంద్ర ప్రసాద్, భట్టుమూర్తిగా పోపూరి గౌరీనాథ్, కవయిత్రి మొల్లగా ముదిగొండ బాలకాత్యాయని, అయ్యలరాజు రామభద్రుడుగా టి.పెద్దిరాజు, ధూర్జటిగా కస్తూరి శివ శంకర్, తెనాలి రామకృష్ణగా మల్లాప్రగడ నందకిశోర్ తమ తమ పాత్రలను అద్భతంగా పోషించి, రూపకం రక్తి కట్టించారు.
ఆలయం తరఫున విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాఠి కవులను కళాకారులను ఘనంగా సత్కరించారు. చిట్టిపిళ్ళారయ్య సేవాదళం పక్షాన జెఎస్ ఎస్ కృష్ణారావు వందన సమర్పణ చేశారు.