ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో భాగంగా ఈగల్ అధ్యక్షులు ఐ జి పి ఆకే రవికృష్ణ , ఎస్పీ లు మహేశ్వర రాజు, కె.నగేష్ బాబు సూచనల మేరకు కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఈగల్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఎన్ డి పి ఎస్ యాక్ట్ అవగాహన తరగతులను కృష్ణాజిల్లా హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ అవగాహన తరగతులకు కృష్ణాజిల్లా అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన రైటర్స్ ,కంప్యూటర్ ఆపరేటర్స్ సుమారు 80 మంది సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ క్రమంలో ఎన్ డి పి ఎస్ యాక్ట్, సెర్చ్, సీజర్, శాంప్లింగ్ డిస్ట్రక్షన్ సమయంలో ఏ విధముగా అమలు చేయాలనే విషయముపై క్షుణ్ణంగా వివరించడమైనది. ఎన్ డి పి ఎస్ కేసులో భాగంగా సమాచారము వచ్చినప్పటి నుండి చార్జ్ షీట్ వేసే వరకు ఎస్సై ఆపై అధికారి పాటించాల్సిన నియమ నిభందనలు ముఖ్యంగా జుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో శాంపిల్స్ సేకరించుట ఇన్వెంటరీ సర్టిఫై చేపించుట, శాంపిల్స్ ను ఎఫ్ ఎస్ ఎల్ కు కెమికల్ అనాలసిస్ కు పంపి రిపోర్ట్ వచ్చిన తదానంతరం డ్రగ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఆద్వర్యం లో ప్రభుత్వం చే గుర్తించబడిన డ్రగ్ డిస్ట్రక్షన్ ప్లాంట్ నందు దహన ప్రక్రియ ను వివరించారు. ఈగల్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ చైతన్యం, సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ చైతన్యం గురుంచి క్షుణ్ణముగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్ బి ఇన్స్పెక్టర్ వి.పెద్దిరాజు, కృష్ణాజిల్లా ఈగల్ సిబ్బంది కె.బాలకృష్ణమూర్తి, కె.మురళి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.