మచిలీపట్నం :
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి 101వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం స్థానిక హౌసింగ్ బోర్డ్ రింగ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన అటల్ బీహార్ వాజ్ పేయి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిలకలపూడి పాండురంగ హై స్కూల్ సెంటర్‌లోని బీజేపీ స్తూపం వద్ద వాజ్‌పేయి జన్మదినోత్సవాన్ని బిజెపి నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి పూలదండలు వేసి, దేశానికి ఆయన చేసిన అపూర్వ సేవలను స్మరించుకున్నారు.
నేషనల్ హైవే గ్రామీణ సడక్ యోజన పేద ప్రజలు ఉన్నతికి అనేక సంక్షేమ పథకాలు, దేశ సంరక్షణకు అణు ఆయుధాలు సమకూర్చటంలో వారు ప్రత్యేక దృష్టి ప్రపంచ లో భారతదేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన మహనీయుడు వాజ్ పేయి అని వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్ర రావు, కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ, తోట రంగనాధ్, చలమల శెట్టి రామకృష్ణ, పుప్పాల రాము, మండల అధ్యక్షులు పుప్పాల హరి , నాగలింగం అయోధ్య రామయ్య, సూరిశెట్టి హరికృష్ణ, వేములపల్లి వెంకటరమణ, పద్మజా, అభినందన, సలాది రామకృష్ణ, సైకం భాస్కరరావు, బొమ్మిడి ,నారాయణస్వామి, నారగనేని పులి, యక్షిత్ తదితరులు పాల్గొన్నారు.