MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

మీ కోసం సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు

  • December 24, 2025
  • 0 min read
[addtoany]
మీ కోసం సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు
మచిలీపట్నం:
 
ప్రపంచంలో ప్రేమ శాంతి ప్రబోధించిన కరుణామయుడు ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కీర్తించారు. 
 
బుధవారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిల్లల చేత కేక్ కట్ చేయించి వారికి తినిపించారు. అనంతరం వారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యేసు ప్రభువు అంటేనే గుర్తుకొచ్చేది స్వచ్ఛమైన ప్రేమ అన్నారు.
 
ప్రపంచంలో శత్రువుతో సహా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రేమించాలన్నదే ఏసు ప్రభువు సందేశం అన్నారు. తనను శిలువ పైకి ఎక్కించిన వానిని కూడా క్షమించిన గొప్ప మహనీయులు ఏసుప్రభువు అని అన్నారు.
 
ప్రేమతో ఎంతటి వారినైనా జయించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి యేసు ప్రభువు అన్నారు. చాలామంది జీవితాలను ప్రేమతో మార్చి వెలుగు నింపారన్నారు.
 
మన బంధువులు స్నేహితులు ఎవరితోనైనా విభేదించి ఉంటే క్రిస్మస్ రోజున వారందరితో ప్రేమగా మెర్రీ క్రిస్మస్ అని పలకరించి కలగలుపుకోవాలని అప్పుడే నిజమైన క్రిస్మస్ కు విలువ ఉంటుందన్నారు.
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ చాలా ముఖ్యమైన పండుగ అన్నారు. క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఏసు ప్రభువు ప్రతి ఒక్కరిలో ప్రేమ, కరుణ, జాలి ఉండాలని బోధించారన్నారు. 
వారి జీవితం ఆదర్శప్రాయం అంటూ తన వలె ఇతరులను కూడా ప్రేమించాలన్నది నేర్చుకోవాలన్నారు.
 
శత్రువులైన క్షమించగలిగే శక్తి ఉండాలన్నారు. 
జీవితంలో మంచి సూత్రాలను పాటిస్తే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఆ స్ఫూర్తిని, విలువలను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకోవాలన్నారు. 
 
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, పర్యవేశకులు నెల్సన్, బేగ్, అబ్దుల్ జబ్బార్ పలువురు కలెక్టరేట్ సిబ్బంది, వారి పిల్లలు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *