కృష్ణాజిల్లా నందు గల చౌక ధరల దుకాణముల ద్వారా జనవరి, 2026 నుండి బియ్యం, పంచదారతో పాటుగా కార్డుదారులకు కార్డు ఒక్కిం టికి ఒక కిలో చొప్పున “చక్కి గోధుమ ఆటా’ను పంపిణీ చేయుటకు ప్రభుత్వము ఆదేశములు యిచ్చియున్నందున నూతన సంవత్సరము జనవరి 2 వ తారీకు నుండి మచిలీపట్నం నగర కార్డుదారులు అందరూ వారికి కేటాయించిన చౌక ధరల దుకాణము నుండి బియ్యము, పంచదార తో పాటుగా కిలో ఒక్కింటికి రూ .20/- లు చొప్పున చెల్లించి “చక్కి గోధుమ ఆటా”ను పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), మంచాన పడిన వారు మరియు వికలాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, జనవరి 2026కి సంబంధించిన నిత్యావసర సరుకులను డిసెంబర్ 26, 2025 నుంచే (5 రోజులు ముందుగా) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద అర్హులైన రేషన్ కార్డు సభ్యులకు వారి ఇళ్ల వద్దకే సంబంధిత డీలర్ల