భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రైతులకు మేలు చేసే అనేక సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు. అందుకే ఆయనను ‘రైతు బాంధవుడు’ అని పిలుస్తారు.
‘జై జవాన్ – జై కిసాన్’ నినాదాన్ని స్మరించుకుంటూ, సాగులో రైతులు పడుతున్న కష్టానికి కృతజ్ఞతలు తెలపడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.
భారత దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు భారత దేశ ఆర్ధిక వ్యవస్థ కు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనేక రాయితీలు ప్రకటిస్తుంటాయి.
రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాగు పద్ధతులు మరియు ప్రభుత్వ పథకాలపై చర్చించడం ద్వారా రైతులకు అవగాహనతో పాటు మేలు చేయగలుగుతాము.
వ్యవసాయం పట్ల నేటి తరానికి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక రైతుల వద్ద నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది.
ఆధునిక సాగు పద్ధతులు మరియు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రోత్సహించడం వల్ల రైతుకు లాభం చేకూరుతుంది.
“రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నం పెట్టే రైతుకు అందరం రుణపడి ఉందాం”.