అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన వంటశాల నిర్మాణం
SSN
- December 23, 2025
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన వంటశాల నిర్మాణం చేపట్టడం ఒక బృహత్తర కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం గుడివాడలో స్థల దాత వి కే ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య భూ విరాళం ఇచ్చిన 1.50 ఎకరాల స్థలంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ప్రవాస భారతీయులు వర్ణ పువ్వాడ ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్న కేంద్రీకృత మధ్యాహ్న భోజన వంటశాల భూమి పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఇప్పటికే పాఠశాలలకు, అన్న క్యాంటీన్లకు ఎంతో అత్యుత్తమ ప్రమాణాలతో నాణ్యత గల ఆహారాన్ని సరఫరా చేస్తోందని ప్రశంసించారు. వారు గుడివాడ చుట్టుపక్కల ఉన్న పాఠశాలల కు మధ్యాహ్న భోజనం సరఫరా చేయుటకు సొంతంగా వంటశాల నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అందుకు స్థలదాత కోదండరామయ్య, వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న వర్ణ పువ్వాడలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ విలువలు ఉన్న ఒక గొప్ప సంస్థని వారు వంటశాల నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప కార్యక్రమం అన్నారు.
అతి తక్కువ ధరకు అత్యంత శుభ్రమైన నాణ్యమైన ఆహారం అందించడం అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ప్రత్యేకత అన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ద్వారా కావలసిన వారికి ఆహారం సమకూరుస్తున్నారన్నారు.
గుడివాడలో వంటశాల నిర్మాణం చేపట్టడం అందుకు స్థలం ఇచ్చిన కోదండరామయ్య, అమెరికాలో ఉంటూ జన్మభూమి గుడివాడను మరిచిపోకుండా వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న వర్ణ పువ్వాడ ఎంతో అభినందనీయులు అన్నారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు వంశీధర దాస మాట్లాడుతూ వంటశాల నిర్మాణం ఒక అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో 23 లక్షల మంది ప్రజలకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానమై మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నామన్నారు.
స్థానికులు కోదండరామయ్య స్థలం ఇచ్చినందుకు, అమెరికా వాసి వర్ణ పువ్వాడ వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
గుడివాడ చుట్టూ ఉన్న 150 పాఠశాలల్లో చదువుకుంటున్న 10 వేల మంది పిల్లలకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందించే విధంగా వంటశాల నిర్మిస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ పిఆర్ రఘునందన దాస, స్థల దాత కోదండరామయ్య
వంటశాల దాత వర్ణ పువ్వాడ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ ఆర్డిఓ జి.బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత రైస్ మిల్లర్ వీరయ్య చౌదరి, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తుమ్పూడి సాంబశివరావు, కృష్ణాజిల్లా పల్సస్ సంఘం అధ్యక్షులు టంగుటూరి శ్రీనివాసు,
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాటూరు రంగనాథ్ పలువురు ప్రజలు పాల్గొన్నారు.

