మీకోసం అర్జీలు 149, ఉద్యోగుల అర్జీలు.10
SSN
- December 22, 2025
- 1 min read
[addtoany]
మచిలీపట్నం:
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మెప్మా పిడి సాయిబాబు, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి మీకోసం —-ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుమునుపు ఉద్యోగుల గ్రీవెన్స్ దినం నిర్వహించి ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు.
కలెక్టరేట్లో మొత్తం 149 మీకోసం అర్జీలు రాగా 10 ఉద్యోగుల అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది.
అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
మచిలీపట్నం ఒకటో డివిజన్ కు చెందిన దివ్యాంగురాలు సజ్జ వీణా దేవి తన తల్లి ఉషారాణితో కలిసి చక్రాల కుర్చీలో కలెక్టరేట్ కు రాగా జిల్లా కలెక్టర్ ఆమె వద్దకు వచ్చి ఆమె సమస్య ఏంటో ఎంతో ఓపికగా ఆలకించారు.ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు 40 సంవత్సరాల వయస్సని, ఇదివరకు దివ్యాంగుల పించను వస్తుండేదని కరెంటు బిల్లు అధికంగా వస్తుందని పింఛన్ ను తొలగించారని తన కూతురు బుద్ధిమాంద్యం కలదని పింఛను పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ తగిన న్యాయం చేయాలని డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్ కు సూచించారు.
మొవ్వ మండలం బార్లపూడి గ్రామానికి చెందిన గోవాడ రవిబాబు తనకు ఎడమకాలు లేదని, 91% వికలత్వ ధ్రువీకరణ పత్రం ఉందని దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై కూడా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఎ పి డి కి సూచించారు.
పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గుడి సేవ లక్ష్మీ రాణి మాట్లాడుతూ తమతోపాటు మరి కొంతమంది రైతులు వరి, మినుము పంటలు వేసుకున్నామని తమకు సమీపంలో కొందరు చేపలు, రొయ్యల చెరువులు త్రవ్వుకుని వాటి వ్యర్ధాల నీటిని పంట బోదేలుకు వదులుతున్నారని ఫిర్యాదు చేస్తూ దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నానికి చెందిన వన్నం రెడ్డి శ్రీనివాస్ గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుకు వెళ్లే రహదారి మార్గంలో తనకు సంబంధించిన భూములను జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వెబ్ ల్యాండ్ కు సంబంధం లేకుండా డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేసినందుకు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ 11 ప్రభుత్వ శాఖల నుండి ఉత్తమ విధానాలకు సంబంధించిన నివేదికలు మిగిలిన శాఖలు కూడా వెంటనే సీపీఓ కు అందజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల లబ్ధిదారుల విజయగాథలను డిఆర్డిఏ పిడికి అందజేయాలన్నారు.
ఈ సందర్భంగా డిటిడబ్ల్యుఓ ముస్తాబు కార్యక్రమం పై రూపొందించిన గోడపత్రాన్ని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ఏపీ ప్రభుత్వ నియమాలు 2023 తెలుగు ఆంగ్ల భాషలో రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డిఎస్ఓ మోహన్ బాబు, డిపిఓ డాక్టర్ జె అరుణ పశుసంవర్ధక శాఖ జీడి అయ్యా నాగరాజు, డిటిడబ్ల్యుఓ ధూర్జటి పహాని మున్సిపల్ కమిషనర్ ,బాపిరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిటిడబ్ల్యుఓ ముస్తాబు కార్యక్రమం పై రూపొందించిన గోడపత్రాన్ని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ఏపీ ప్రభుత్వ నియమాలు 2023 తెలుగు ఆంగ్ల భాషలో రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డిఎస్ఓ మోహన్ బాబు, డిపిఓ డాక్టర్ జె అరుణ పశుసంవర్ధక శాఖ జీడి అయ్యా నాగరాజు, డిటిడబ్ల్యుఓ ధూర్జటి పహాని మున్సిపల్ కమిషనర్ ,బాపిరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

