జిల్లా స్థాయి రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జాతీయ గణిత దినోత్సవం వేడుకలు LA ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు నాయకత్వంలో విజయవంతంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్, DCEB సెక్రటరీ విజయ్, గరికపాటి గోపీచందు, LA ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ, LA ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీరామ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు ప్రసంగిస్తూ విద్యార్థుల జీవితంలో వైజ్ఞానిక దృక్పథం మరియు గణిత విజ్ఞానం అత్యంత కీలకమని తెలిపారు. శాస్త్రీయ ఆలోచన విద్యార్థుల్లో తార్కిక శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో సీఈఓలుగా పనిచేస్తున్న భారతీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ ప్రదర్శనలో పాఠశాలలో మొత్తం 196 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.