యోగా తో అద్భుత ప్రయోజనాలు
మచిలీపట్నం :
ఇటీవల రాష్ట్ర స్థాయి లో ఫైళ్ళ పరిష్కారం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి ప్రశంసలు పొందిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీని యోగా గురువులు మరియు సభ్యులు ఘనంగా సన్మానించారు .
సోమవారం ఉదయం గాంధీనగర్ లోని వాకర్స్ అసోసియేషన్ హాలు లో యోగా తరగతులు అనంతరం కలెక్టర్ గారిని శాలువాలు, పూల దండలు, పుష్ప గుచ్చాలు, మొక్కలతో ఘనంగా
సన్మానించారు.
ఈ కార్యక్రమం లో యోగా గురువులు గురునాధబాబు, మహాలక్ష్మీ, చింతయ్య, వడ్డి శ్రీనివాస్ గారు, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్ మోహన్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు అంకెం జితేంద్ర, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ఎఓ మానేపల్లి శ్రీనివాస్, కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ రాము, అశోక్ మాస్టర్, చోడే పద్మావతి, ఆర్ డి ప్రసాద్ , రాజకుమారి, రేఖా రంజిత, సౌమ్య , వరలక్ష్మీ, యోగా సభ్యులు పాల్గొన్నారు.