మచిలీపట్నం :
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు శనివారం పరావస్తు చిన్నయ్య సూరి జయంతి ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ ఆయన చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరావస్తు చిన్నయ్యకి సూరి అనేది బిరుదు అనీ, ఆయన ప్రసిద్ధిగాంచిన తెలుగు రచయిత, పండితులు అనీ అన్నారు. ప్రసిద్ధ నవలలు రచనలు చేసిన ఘనుడన్నారు. విశ్వ నిఘంటువు, అకారాది నిఘంటువు, ఆంధ్ర దాతువులు, బాల వ్యాకరణం, నీతిచంద్రిక మొదలగునవి ఎన్నో ఆయన కలం నుండి జాలువారిన రచనలు అన్నారు.
కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బి. విజయ్ కుమార్ మాట్లాడుతూ పద్యానికి నన్నయ –గద్యానికి చిన్నయ్య అనే లోకోక్తి ఉండేది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.