శ్రీ కళంజలి థియేటర్స్, విజయవాడ వారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యం తో మచిలీపట్నం లోని స్థానిక మహతి కళా వేదిక, హిందూ కాలేజ్ ఎదురుగా, బచ్చు పేట నందు 20,21 డిసెంబర్ 2025 తేదీలలో భక్త చింతామణి, సత్య హరిశ్చంద్ర నాటకములు ప్రదర్శన ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్, ఈటీవీ పాడుతా తియ్యగా ఫేమ్ టి.రాజబాబు తెలిపారు.
సమాజ రుగ్మతలను ఎత్తిచూపి నవ సమాజం కోసమే, భక్త చింతామణి అని సత్యమేవ జయతే అనే వ్రతదీక్షతో హరిశ్చంద్రకధ ఆసాంతం ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఈ నాటకాల లో టి రాజేశ్వరావు, పూర్ణచ్చందరావు, దిరిశం శ్రీనివాస్ రావు, బేగ్ శివశ్రీ, దసిక రమేష్, ముత్యాలు ఏసుబాబుమొదలైన సుప్రసిద్ధ కళాకారులు పాల్గొంటారు.