ఇటీవల అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నగిరి చెన్నయ్య మార్కెట్ లోని కోనేటి సుధాకర్ రావు కి చెందిన కారం మిల్లు నందు గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి క్యాష్ కౌంటర్ లో ఉన్న 10,000 రూపాయలు డబ్బులను, కళంగని రుద్రాక్ష మాలను (వెండిది ) దొంగతనం కు పాల్పడ్డారు. సుమారు వాటి విలువ 30 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ దొంగతనంపై మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా ఆర్ పేట పోలీస్ స్టేషన్ ఉమెన్ ఎస్సై ఎం. మాణిక్యమ్మ తన సిబ్బంది సహాయంతో వారికి రాబడిన సమాచారం మేరకు మచిలీపట్నం లోని సర్కిల్ పేట నందు బొమ్మిడి కనకయ్య ఇంటి వద్ద నేరముకు సంబంధించిన ముద్దాయిలైన జోగి గోపి తండ్రి సుబ్రహ్మణ్యం, 22 సంవత్సరాలు, రాజుపేట మచిలీపట్నం, బొమ్మడి శ్రీనాథ్ తండ్రి కనకయ్య, 22 సంవత్సరాలు, సర్కిల్ పేట, శివరాత్రి మరియదాసు అలియాస్ పవన్, తండ్రి రాంబాబు, 23 సంవత్సరాలు, సర్కిల్ పేట అనువారి ని అదుపులో తీసుకుని విచారించగా నేరము రుజువు కావడంతో వారి వద్ద నుండి తరంగణి మాల (వెండి రుద్రాక్ష మాల) సుమారు 20 వేల రూపాయలు రికవరీ చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్ డిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.