బీమా రంగం లో 100% విదేశీ ప్రతక్ష పెట్టుబడులు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు నిరసనగా గురువారం వివిధ సంఘాల నాయకులు క్యాండిల్ లైట్స్ తో నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ,బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 74 నుండి 100 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రజా ఆమోదం కాదని పేర్కొన్నారు.’సబ్కా బీమా సబ్కీ రక్ష’ – 2025 పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు కూడా ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాల మధ్య పార్లమెంటు ఆమోదించింది అని, మరో ప్రక్క ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది అని, ఈ చర్యలు ప్రజల పొదువు పై ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను కూడ ఉపసంహరించాలని ప్రయత్నం జరుగుతోంది అని దీన్ని వ్యతిరేకించాలిసిన అవసరం వుంది అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, బీమా సంస్థలకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు బీమా రంగంలో విదేశీ ఈక్విటీ 100 శాతం పెంపుదలను వ్యతిరేకిస్తూ సంయుక్తంగా నిరసన తెలిపారు. స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించగ. బ్యాంక్, బీమా రంగాలకు అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇన్సూరెన్సు బ్యాంకు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జి. కిషోర్ కుమార్, డి. వాసు, వై స్వామినాధ్, ప్రసాద్, శ్రీనివాస్, వాణి, ఝాన్సీ, రాధా కృష్ణ మూర్తి, గుప్తా తదితర నాయకులు పాల్గొన్నారు.