దేవాలయాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, గొర్రెపాటి గోపీచంద్ అన్నారు.దేవాలయాల దర్శనం ద్వారా ఆధ్యాత్మిక చింతన తో పాటు మనస్సుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. పెద్ద కరగ్రహారం శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పెదసింగు సామేరు, కమిటీ సభ్యులుగా బొర్రా రాము, పడమట నాగేంద్రం, పరసా వెంకటేశ్వరరావు,పరసా అంకాలు, పరసా ప్రసాద్, కట్టా రవికుమార్, తోట సాయి, నల్ల గోపుల అమ్మాజీ లు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాలయాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది ధర్మకర్తల మండల సభ్యులు అన్నారు. కమిటీ సభ్యులు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు వెళుతూ మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహిస్తూ భక్తుల సహకారం, ప్రభుత్వ సహకారంతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక చింతన తో దేవాలయ ప్రాంగణంలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవలసిన బాధ్యత అభివృద్ధి కమిటీ సభ్యులదే నన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, ఆక్వా కల్చర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, లంకె నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్, కుంచే నాని, గవర్నమెంట్ హాస్పటల్ మాజీ చైర్మన్, తలారి సోమశేఖర్, మాజీ ఎంపీటీసీ, బోలెంఅయోధ్య రామయ్య, మాజీ సర్పంచ్, పరసా వడ్డీ కాసులు, వేణుగోపాలస్వామి దేవస్థానం చైర్మన్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకుడు, తోట భాస్కరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బత్తిన నాగరాజు, కొల్లాల అంజి,మద్దూరి ప్రసాద్, జె ఎస్ ఎస్ కృష్ణారావు, బిజెపి నాయకులు, కంచర్లపల్లి వెంకట రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, చోడవరపు లక్ష్మీప్రసన్న, ఆలయ ఈవో గోవాడ వెంకట కృష్ణారావు , ఆలయ అర్చకులు చోడవరపు ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు..