సోమవారం కలెక్టరేట్ లో చాంబర్ నందు ఈనెల 21వ తేదీ జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం పై రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.