హత్య? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న చిలకలపూడి పోలీసులు.
మచిలీపట్నం :
మచిలీపట్నం 14వ డివిజన్ చెందిన కె శివ అనే వ్యక్తి గత రెండు రోజులకు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శివ కుటుంబ సభ్యులు మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు ను నమోదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి పెడన మండలం కొంకేపూడి చెరువు వద్ద మృతదేహం లభ్యమయింది. దీనితో పోలీసులు అనుమానాధాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. శివ అనే వ్యక్తి ను హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణంను వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
అయితే రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో (కొంతమంది వాట్సప్ గ్రూపులో మాత్రమే ) మతిస్థిమితం లేదని చక్కర్లు కొడుతున్న వార్తలలో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. స్థానికులు కొంతమంది మతిస్థిమితం లేదు అని వస్తున్న వార్తలను అవాస్తవం అంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.