గురుకులం పిలుస్తోంది 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
SSN
- February 3, 2026
- 1 min read
[addtoany]
మచిలీపట్నం:
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాల యాలు పేద విద్యార్థుల పాలిట ఆశా కిరణాలు. గ్రమీణ ప్ర Oతాల్లో చదువుకోవడానికి ఆర్ధిక స్తోమత, సౌకర్యాలు లేని నిరుపేదలు గురుకు లాల వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడ సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారంగా మారుతుందని వారి అభిప్రయం . కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యా బోధన అందిస్తుంటారు. విద్యార్థులకు బోధనతో పాటు ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులు, వసతి, పౌష్టికాహారంతో పాటు అన్ని సౌకర్యా లను ప్రభుత్వం కల్పిస్తుంది. మెరుగైన విద్య, పూర్తిస్థాయి వసతులు ఉండటంతో ఏటా వీటిల్లో ప్రవేశాలకు పోటీ ఉంటుంది.
వయసు
5వ తరగతిలో ప్రవే శానికి విద్యార్థులు పద కొండు సంవత్సరాల లోపుండాలి. ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం ప్రవేశం నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. తల్లిదండ్రల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.
అర్హులైన విద్యా ర్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. ఆధార్, పాస్పోర్ట్సైజ్ ఫొటో, విద్యా దృవీకరణ పత్రం, ఆధార్ కార్డుకు అను సంధానమైన ఫోన్ నంబరుతో వెబ్సైట్ ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తు ద్వారా చేసుకోవాలి. వివరా లకు సంబంధిత గురుకుల పాఠశాలల అధ్యాపకులను సంప్ర దించాలి.
విద్యార్హతలు
5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు. పొందిన ప్రవేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవ త్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరానికి 2025-26 విద్యా సంవ త్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సీట్ల భర్తీ ఇలా…
ఈ ఏడాది (2026-27) విద్యా సంవత్సరానికి 5వ తర గతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన ప్రవేశా లకు దరఖాస్తులు ఆహ్వానిస్తు అన్నారు. ఫిబ్రవరి 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అదికారులు చెపుతున్నారు. కొన్నింటిలో 6, 7, 8, 9 తరగ తుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన విద్యా ర్థులు ఆ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లాలోని ప్రతి పాఠశా లలో ఎంపీసీ 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయి. 5వ తర గతిలో ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి. మొత్తం 13 ఉన్నాయి అవి కృష్ణ మరియి ఎన్‌టిఆర్ జిల్లా లో 1. వీరపనేనిగూడెం బాలికలు, 2.పామర్ర బాలురు, 3.రుద్రవరం బాలురు, 4.చల్లపల్లి బాలికలు, 5.బల్లిపర్ర (ఏంఈ సి మరియు సియిసి) బాలికలు, 6.మోటూరు బాలికలు, 7.జగ్గయ్యపేట (ఏంఈ సి మరియు సియిసి) బాలికలు , 8.ముప్పాళ్ళ బాలికలు, 9.కుంటముక్కల బాలికలు, 10.కృష్ణరావుపాలెం బాలురు, 11.తిరువూరు బాలురు, 12.రంగాపురం బాలికలు, 13.నర్సాపురం బాలికల గురు. కులాలున్నాయి.

