మచిలీపట్నం ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం విజయవాడ అక్కినేని హాస్పిటల్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు స్థానిక ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విజయవాడ అక్కినేని హాస్పిటల్ ఎండి డాక్టర్ అక్కినేని మణి , ముఖ్య అతిధి యూరాలజిస్ట్ అండ్ ఆబ్జెక్టిక్స్ గైనకాలజీ నియోనేటాలజీ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెసిలిస్టులు చే సుమారు 200 మంది గ్రామీణ వైద్యులకు స్త్రీల రుగ్మతల గురించి అలాగే నవజాత శిశువుల గురించి అలాగే ప్రీ మెచుర్ బేబీ గురించి చిన్నపిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్త్రీల అనారోగ్య సమస్యల పై అవగాహన కల్పించారు.
ఈ సదస్సును రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 200 మంది గ్రామీణ వైద్యుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, కోశాధికారి డేవిడ్ రాజు, కృష్ణాజిల్లా అధ్యక్షులు పిఎస్ఐ ఖాన్ , ప్రధాన కార్యదర్శి నాగభూతారావు, కోశాధికారి వాసుదేవ మూర్తి, మండల అధ్యక్షులు, కార్యదర్శి ,కోశాధికారులు ,ఎక్సక్యూటివ్ మెంబెర్స్ రాజేష్, కోశాధికారి రత్తయ్య అర్జున్ రావు, హరిప్రసాద్ దుర్గా రావు కోటేశ్వర రావు, విజయసాయి , తదితరులు పాల్గొన్నారు.