MachilipatnamLocal News
March 6, 2026
మచిలీపట్నం

ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డా. లీలా ప్రసాద్

  • March 6, 2026
  • 1 min read
[addtoany]
ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డా. లీలా ప్రసాద్
మచిలీపట్నం, మార్చి6, 2026, SSN:
 
     మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లీల ప్రసాద్. ఇటీవల ప్రభుత్వం నూతన సూపరింటెండెంట్ గా లీలా ప్రసాద్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రి లో పలువురు డాక్టర్లు అభినందనలు తెలిపారు.  
      డా.లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ముందుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. కొన్ని సమస్యలు బడ్జెట్ తో ముడి పడిన అంశాలు కూడా ఉంటాయి అని వాటిని ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ లు, డాక్టర్లు, ఆఫీస్ ఏ డి, ఏఓ, సహచర డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *