MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

ఘనంగా పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి

  • February 11, 2026
  • 1 min read
[addtoany]
ఘనంగా పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి
మచిలీపట్నం :
 
భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం
ఘనంగా – మాజి సమర్పణ దివస్, కార్యక్రమం ను బిజెపి కార్యాలయంలో, జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథి గా రాష్ట్ర నేషనల్ ప్యానెల్ అధికార ప్రతినిధి యామిని శర్మ పాల్గొని ప్రసంగించారు.
 ఈ సందర్భంగా యామిని శర్మ మాట్లాడుతూ, భారతీయ జనసంఘ్ మాజి అధ్యక్షులు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి ని, సమర్పణ దివస్ గా జరుపుకుంటున్నాం అని దీనదయాళ్ చిన్నతనం లోనే తల్లి, తండ్రులు లను కోల్పో యారని మేనమామ వద్ద పెరిగిన ఆయన చదువు కొనే సమయంలో మొదటి శ్రేణిలో పాస్ అయ్యే వారిని, ఆ సమయం లోనే దీనదయాళ్ ఉపాధ్యాయ కి ఆర్ఎస్ఎస్ పరిచయం ఏర్పడి , దేశ, సమాజ సేవలో పని చేయడానికి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నారు.డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ గురూజీ ని కలిసి కొంతమందిని ఇవ్వాలని కోరగా, దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి,తదితర ప్రముఖులను జనసంఘ్ పార్టీ కి పంపించారు. 1953 నుండి 1968 వరకు జనసంఘ్ లో అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ ని దేశం వ్యాప్తం చేసారు.
విజయవాడ లో జరిగిన జాతీయ పార్టీ సమావేశాలలో – ఏకాత్మ మానవతా వాదాన్ని – ఏకగ్రీవంగా పార్టీ సిద్ధాంతంగా అంగీకరించారు.‌ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు చేయాలన్నదే అంత్యోదయ కార్యక్రమం ఆవాజ్ పాయ్, ఈనాటి మోడీ ప్రభుత్వం, విఖసిత్ భారత్ కార్యక్రమం ఘనంగా అమలు చేశారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ దేశ సేవ, త్యాగనిరతి, సిద్దాంతాన్ని అందించిన ఆయన ఆదర్శాలు మనకు ఆచరణీయం అని, దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బిజెపి -సమర్పణ దివస్ – జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో పంతం గజేంద్ర, పుప్పాల రాము, ఎస్.సుబ్బారావు నాయుడు,కూనపరెడ్డి శ్రీనివాస్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, సూరి శెట్టి హరికృష్ణ,వైవిఆర్ పాండురంగారావు, వి. రమణ, గాజుల సిద్ధార్థ, ఎన్.గాయత్రి, మండల అధ్యక్షులు సాయి, కెవి రామారావు, వి. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *