• ఉచిత స్కిల్ ట్రైనింగ్‌కు యువత ముందుకు రావాలి
• నైపుణ్యాభివృద్ధి ద్వారానే మెరుగైన ఉపాధి అవకాశాలు
మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు.
ఈ స్కిల్ హబ్‌లో కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోర్సుపై ఉచిత శిక్షణ ఈ నెలలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. నూతన సాంకేతికత ఆధారంగా నిపుణుల ద్వారా శిక్షణ అందించి, స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.జిల్లాలోని ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కోర్సుకు ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 90226 79999 నంబర్‌ను సంప్రదించి తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.