కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పేరు, ఫోటోలను ఉపయోగిస్తూ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించి, వాటి ద్వారా ప్రజలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తూ, డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీనితో అప్రమత్తమైన అధికారులు ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి ఫేక్ అకౌంట్లను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నగర డిఎస్పి రాజా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే ఈ ఫేక్ అకౌంట్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, అకౌంట్లు సృష్టించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లు లేదా అనుమానాస్పద సందేశాలు కనిపిస్తే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.