MachilipatnamLocal News
February 13, 2026
కృష్ణా జిల్లా

ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: ఎస్.టి.యు. ధర్నా

  • February 13, 2026
  • 0 min read
[addtoany]
ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: ఎస్.టి.యు. ధర్నా
మచిలీపట్నం :
            
      కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ప్రధానమైన డిమాండ్ తో ఎస్.టి.యు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మచిలీపట్నం ధర్నా చౌక్ లో కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
 
         రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో ఉద్యోగులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్కటి పూర్తి గా అమలు చేయలేదని, ప్రధానంగా 12వ పి.ఆర్.సి. నియామకం, 30% మధ్యంతర భృతి మంజూరు, సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేయాలని, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 
        జిల్లా అధ్యక్షులు పి. ఇమ్మానుయేల్ ప్రసంగిస్తూ ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు ఎస్.టి.యు. దశల వారీ ఉద్యమం లో భాగంగా ధర్నా జరుగుతుందని, ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల 25 న “చలో విజయవాడ” చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు వి కృష్ణమూర్తి మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి చెల్లింపులు సం.ల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయని, రాష్ట్ర ముఖ్య మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. 
 
        రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ డి.ఎస్.సి. 2003 టీచర్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కొమ్ము ప్రసాద్, ముతహర్ అలీ, కృష్ణ మోహన్, సతీష్, శ్రీనివాస్ మూర్తి, జిల్లా అధ్యక్షులు పి. ఇమ్మానియేల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. వి. కృష్ణ మూర్తి,రాష్ట్ర అదనపు కార్యదర్శి డి చంద్రశేఖర్ ,రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి కె. మాధవ రావు ,రాష్ట్ర కౌన్సిలర్ కొమ్ము ప్రసాద్ ,ఎం వి ఎస్ ఎన్ ప్రసాద్ కే సతీష్ బాబు అర్బన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. కిరణ్ బాబు యం. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *