మచిలీపట్నం:
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హై టి….అట్ హోం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.
ముఖ్యంగా శాంతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కళాకారులు స్వాతంత్ర్య సమరయోధుల వీర గాధలను, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రూపుదిద్దుకున్న వైనం వివరిస్తూ ప్రదర్శించిన బుర్రకథ అధ్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రత, ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ బుర్రకథ ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సంబంధించి వివరాలను చాలా తక్కువ సమయంలో ఇచ్చినప్పటికీ బుర్రకథ ద్వారా ఎంతో చక్కగా వివరించారని కళాకారులను అభినందిస్తూ ఆ కళాకారులను శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
అలాగే కూచిపూడి నృత్య కళాకారులు ఏలేశ్వరం పూర్ణచంద్రరావు శిష్య బృందం ఎస్ అశ్విత సాయి పూర్ణ ,సిహెచ్ జాహ్నవి భక్తినృత్యాలు కూడా ఎంతగానో అహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కోనేరు సెంటర్ వద్ద జాతీయ జెండాను నిలిపి స్వాతంత్ర సమరయోధులు తోట నరసయ్య నాయుడును వీరగాధ దృశ్యరూపకాన్ని బాలాజీ విద్యాలయం విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్య కళాకారులు, మధు డాన్స్ అకాడమీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులను సీనియర్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఎ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య, జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు గుడివాడ మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓ లు పోతురాజు, జి బాలసుబ్రహ్మణ్యం, బిఎస్ హేలా షారోన్ పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డీఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల డిఎం శివరాం ప్రసాద్, మార్కెటింగ్ ఏడి నిత్యానందం పని ధూర్జటి డి టి డబ్ల్యూ పని దూర్జటి
తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.