మచిలీపట్నం :
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కాగువాడ గ్రామం లో మంచు కృష్ణ రావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర చేనేత చైతన్య సభ ను నిర్వహించారు. ఈ సభ కి ముఖ్య అతిథులుగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చేనేత ప్రతినిధులతో పాతపట్నం నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం లోని చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వం చేసిన హామీల అమలు గురించి అడిగిన ప్రశ్నలకి నందం అబద్దయ్య సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, మన రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తప్పకుండా చేనేత కార్మికులు ఇచ్చిన మాటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని తెలిపారు.
కార్మికులలో నందం అబద్దయ్య బరోసా నింపారు. అలాగే మరికొన్ని సమస్యలు పైన స్థానిక ఎమ్మెల్యే తో పాటు కలిసి నందం అబద్దయ్య ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నేను ఎల్లపుడు ముందు ఉంటానని, అలాగే కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయటం కోసం మంగళగిరి శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని , చేనేత శాఖ మంత్రి సవిత ని , కలిసి హామీల అమలు గురించి చర్చించి మంత్రులకు వినతిపత్రం అందచేసి సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని నందం అబద్దయ్య తెలిపారు.