MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలపై హత్యాయత్నం కేసు !!

  • March 27, 2026
  • 1 min read
[addtoany]
బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలపై హత్యాయత్నం కేసు !!
అభం శుభం తెలియని బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు జుజ్జువరపు సుప్రియ పై పామర్రు పోలీసులు ఆకారణంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. 
 
ఇటీవల పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్ పరిధిలోని హోంగార్డు కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేశారనే కేసును సుప్రియపై నమోదు చేశారు. దీనిపై రిమాండ్కు వచ్చిన ఆమెను మచిలీపట్నం సబ్ జైలులో గురువారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి పేర్ని నాని పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ తెలుగు తమ్ముడు గణేష్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు తీసుకున్న చర్యలు సరికాదని హితవు పలికారు. పొలంలో మినపకాయలు లాగుతున్న సమయంలో తన తండ్రిపై నేరం మోపేందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ లు స్టేషన్ కు పిలిపించారని ఆమె తెలిపారన్నారు. సోదరుడు తేజను దుర్భాషలాడితే దీనిపై సుప్రియ ప్రశ్నించినందుకు హోంగార్డు కోటేశ్వరమ్మతో బట్టలు చిరిగిపోయేలా ఆమెను లాక్కెళ్లటం అఘాయిత్యం కాదా అని పేర్ని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతీపై చెయ్యి పెట్టి తోసేశారని ఆ అభాగ్యురాలు చెబుతుంటే నిర్ఘాంతపోయామన్నారు. సీఐ, ఎస్సైలు ఆమె పైన దాడి చేయడంతో రక్తం వస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆటోలో బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తమకు తెలియజేసిందన్నారు. మూడు రోజులైనా వాంగ్మూలం రికార్డు చేయడానికి పోలీసులు రాకపోవడం దారుణమని తెలిపారన్నారు.
విన్నవించుకుందామని వస్తే అరెస్టు చేస్తారా?
 
తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ ఎదుట వ్యక్తం చేస్తే, ఆయన డిఎస్పీ శ్రీనివాసరావుకు ఆర్జీని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. డీఎస్పీ ఆమెను నమ్మబలికి పామర్రు పోలీసులకు అప్పచెప్పారన్నారు. వారు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారని ఇలా చేయడం న్యాయమా అని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. కలెక్టర్కు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారో గ్రహించాలన్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసులు హోంగార్డు కోటేశ్వరమ్మను పావుగా ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. పోలీసులు ఆమెకు రిమాండ్ విధించేలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతో మంది టీడీపీ, జనసేన రౌడీలు రాజ్యమేలుతున్నా వారికి మాత్రం స్టేషన్ బెయిల్ తప్ప రిమాండ్ ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు.
 
ఈ పాపం ఊరికే పోదు..
 
టీడీపీ నాయకుడు గణేష్ కళ్లలో ఆనందం కోసం.. పోలీసులు ఆమె విషయంలో చేసిన పాపాలు ఊరికే పోవన్నారు. గణేష్ ఎన్నికల కౌంటింగ్ కు ముందు జుజ్జువరపు చిన్ని తమ్ముడి ఇంటిని తగలబెడితే కేసు నమోదు చేయలేదన్నారు. దళితురాలి విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందన్నారు. డిసీఎం పవన్ కల్యాణ్కు.. 50 మంది పోలీసులతో బందోబస్తు, ఒక విమానం ఇస్తే ఇలాంటి ఘటనలు కనపడకుండా పోతాయా అని ప్రశ్నించారు. ఓదార్పు మాటలు చెప్పి దళిత మహిళను జైల్లో పెట్టిస్తావా అని డిఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు కోటేశ్వరమ్మ మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి విచారణ చేస్తూ విర్ర వీగుతుంటే మీ చదువుకు అర్థం లేకుండా పోతుందన్నారు. అభం శుభం తెలియని జైలులో ఉన్న సుప్రియకు న్యాయం జరిగే రోజు త్వరలోనే ఆ దేవుడు కల్పించాలని పాము కోరుకుంటున్నామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *