MachilipatnamLocal News
March 11, 2026
మచిలీపట్నం

బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణం

  • March 11, 2026
  • 1 min read
[addtoany]
బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణం
మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
       స్థానిక బచ్చుపేటలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం నూతన పాలకమండలి చైర్మన్ గా ముత్తేవి రవికాంత్ ప్రమాణస్వీకారం చేశారు. పాలకమండలి సభ్యులుగా ఐనంపూడి రాజశేఖర్, తాడేపల్లి హరి గోపాల్ రావు, తోట లక్ష్మీకుమారి, బోయిన నాగలక్ష్మి, పిట్టా సౌమ్యశ్రీ, ఎం.లావణ్య, చలమల శెట్టి రామకృష్ణ గాంధీ, కొడాలి వెంకటేశ్వరమ్మ, ఆరెపల్లి దుర్గాభవాని, దేవరపల్లి చక్రవర్తి, ముత్తెవి కృష్ణప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు.
      ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, టిడిపి కార్పొరేటర్ దేవరపల్లి అనిత, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివీ ఫణి కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, ఎల్ఐసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *