ఇటీవల జిల్లావ్యాప్తంగా మిగిలిపోయిన 11 బార్ల దరఖాస్తులకు లాటరీ విధానాన్ని నిర్వహించారు. 6 బార్లకు మొత్తం 37 దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ గురువారం లాటరీ విధానంతో ఎంపిక చేశారు. 2026- 28 సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 11 బార్లకు 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.
మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఐదు బార్లకు, గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో 1 బారు కు లాటరీ విధానంలో లైసెన్సు లు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మంజూరు చేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు రాని ఐదు బార్ల ఎంపిక చెయ్యలేదు.
గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో 4 బార్లకు, పెడన మున్సిపాలిటీ పరిధిలో 1 కి దరఖాస్తులు రాకపోవటంతో వాటికి లాటరీ విధానంను రద్దు చేస్తున్నట్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.