MachilipatnamLocal News
March 15, 2026
పోలీస్ & లీగల్ డైరీ

బందరులో చోరీ….వెండి అపహరణ

  • March 14, 2026
  • 0 min read
[addtoany]
బందరులో చోరీ….వెండి అపహరణ
మచిలీపట్నం :
       బుట్టాయిపేట లోని అరవ గూడెం మామిడి బత్తుల యుగంధర్ ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కొంత మొత్తం నగదు వెండి  వస్తువులు చోరీ కాబడినట్లు ఇంటి యజమానులు తెలిపారు. చోరీ కాబడిన వెండి ఆభరణాల విలువ 1,50,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
        తాళం వేసి యున్న ఇంటిని దొంగలు పక్కా పథకం ప్రకారం ప్రణాళిక వేసి ఇంటి లో విలువైన వాటిని దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. చోరీ పై బాధితులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం తో విచారణ చేపట్టి ఫింగర్ ప్రింట్ ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *