మచిలీపట్నం :
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు.
ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణం ను చెడగొట్టి ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడ్డారు. హత్య రాజకీయాలు కక్ష సాధింపు చర్యలకు కూటమి విరుద్ధం అని అన్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బిసి నేత బంగారయ్యను వైసిపి నేతలు అతికిరాతకంగా హత మార్చారు అని బడుగు బలహీన వర్గాలపై వైసీపీ నేతలు ధమనకాండ కు పాల్పడడం ను తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు.
వైసిపి హయాంలో జగన్ అండతో వైసీపీ నేతలు బీసీలపై దమనకాండ కు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు అని వైసిపి హాయంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు కోత పెట్టడం వల్ల 16,800 మంది బిసి ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారు అని అన్నారు.
జగన్ పాలనలో బీసీలకు జరిగింది అడుగడుగున అవమానమే, జగన్ సొంత జిల్లా ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను రోడ్డుమీద అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అమర్నాథ్ గౌడను నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. పల్నాడులో జల్లయ్య యాదవ్, తోట చంద్రలాంటి వందలాది మంది బీసీలను హత్య చేశారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, జిల్లా అధికార ప్రతినిధి పేర్ల కోస్తా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.