మహిళల భద్రతే ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల లో భాగంగా కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నం పోలీస్ యూనిట్ హాస్పిటల్ నందు మహిళా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… మహిళా సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని, నిరంతర ఆరోగ్య పరీక్షలు అవసరమని పేర్కొన్నారు. మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విధులకు ఎంత ప్రాధాన్యతిస్తామో అలాగే మన ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక దృష్టి కేటాయించాలని వ్యాయామం చేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు.
శిబిరంలో పోలీస్ యూనిట్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది మహిళా సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, పోషకాహారం మరియు సాధారణ ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. రమేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు .