MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

ఆక్వా రైతుల సమస్యను అధికారులు పరిష్కరించాలి

  • March 11, 2026
  • 1 min read
[addtoany]
ఆక్వా రైతుల సమస్యను అధికారులు పరిష్కరించాలి
మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
       బుధవారం నగరంలోని  వైసీపీ కార్యాలయం లో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆక్వా  రైతుల పట్ల  జిల్లా అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు.
        పేర్ని మాట్లాడుతూ…. మంత్రి కొల్లు రవీంద్రకు చెందిన ఇద్దరు అనుచరులు గత మూడు నాలుగు నెలలుగా బందరు దక్షిణ మండలంలోని పోలాటతిప్ప, పల్లె తుమ్మలపాలెం, వాడపాలెం, కోన, పాతేరు, తుమ్మలచెరువు, కే పి టి పాలెం గ్రామాల్లో చెరువులకు మరమ్మత్తులు  చేయడానికి వీలు లేదని ఆ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ పెట్టే ఆలోచనలో మంత్రి ఉన్నారని అక్కడ రైతులను బెదిరిస్తున్నారని  అన్నారు .
 
        సమస్య పరిష్కారనికి ఆక్వా రైతులు మంత్రి కొల్లు రవీంద్ర ని కలవగా.,. మంత్రి సైతం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని  ఆక్వా సాగు కు అవకాశం లేదు అని అన్నారని నాని అన్నారు. ఎకరాకు నలభై నుంచి యాభై వేలు లీజు వచ్చే చెరువులకు…. ఇరవై ఐదు వేలు లీజు ఇస్తామని సదరు ఇద్దరు మంత్రి వ్యక్తులు  ప్రతిపాదించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్ని తెలిపారు. 
      పేర్ని మాట్లాడుతూ…  రైతులు చెరువులు మరమ్మత్తు చేయకూడదని,  సౌత్ మండలం ఎమ్మార్వో గ్రామాల్లో పర్యటించి మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. రూల్స్ ఏమయ్యాయి. ఆర్డీవో కి, కలెక్టర్ కి తెలిసే ఇదంతా జరుగుతున్నట్లుగా ఒక దిన పత్రికలో వార్త వచ్చింది.
       నిజంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచనే ఉంటే జిల్లా కలెక్టర్ స్పందించాలి కానీ, టీడీపీ నాయకులు అడ్డుపడటం విడ్డూరంగా ఉంది. జిల్లా కలెక్టర్ అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు. 
       చిన్న, సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టె ఆలోచన విధానం మార్చుకోవాలి. చెరువులు రిపేర్ చేయనివ్వరు, కొత్తవి తవ్వనివ్వరు. మరి ఆక్వా రైతుల కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది. రెవిన్యూ యంత్రాంగం రాజకీయ నాయకులకు వంత పాడే పనులు చేస్తే ప్రజలు ఎవ్వరికి చెప్పుకోవాలి.
         రెవిన్యూ యంత్రాంగం రైతాంగాన్ని ఏడిపించే పరిస్థితి వస్తే రైతులని సమీకరించి ఖచ్చితంగా రెవిన్యూ ఆఫీసులను ముట్టడిస్తాం. ఎద్దు వచ్చి చేలో మేస్తుంటే  చూస్తూ ఊరుకోం.. ముళ్ళ కర్ర పెట్టి అదిరిస్తాం… హే హే అని అరుస్తాం…. భయపడి పోతుందేమో అని, కానీ బరితెగించి ఇంకా మేస్తుంటే , ఖచ్చితంగా ముళ్లకర్ర పెట్టి తోలటం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి.
        రైతులకి చెరువులు మరమ్మత్తు చేసుకోవడానికి వేసవికాలం  అనువైన కాలం. రైతు కడుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడు అని గుర్తుపెట్టుకోండి. కార్యాలయాలు ముట్టడి చేస్తాం, మీరు తప్పుడు కేసులు పెడితే…  జైలు  నింపుతాం అని పేర్ని హెచ్చరించారు.
        ఆక్వా రైతాంగం సమస్యలు విని అధికారులు రైతులకు న్యాయం చేయాలని నాని విజ్ఞప్తి చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *