MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’

  • January 23, 2026
  • 1 min read
[addtoany]
ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’
– మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు
– భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
– మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపుల ఏర్పాటు
– మెడికల్ క్యాంపులో 350 యూనిట్ల రక్తం దానం, 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.
 
మచిలీపట్నం :
 
       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదానం, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిభిరాలు నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర రక్తదానం చేసిన వారిని అభినందించారు. పండ్ల రసం అందించి ధృవీకరణ పత్రాలు అందించారు. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో సుమారు 2000 మంది పాల్గొన్నారు. 350 మంది రక్తదానం చేశారు. ఒక రోజులో ఇంత మంది రక్తదానం చేయడం ద్వారా జిల్లాలో రికార్డు సృష్టించాలని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు అనంతరం 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కేంద్రాల్లో భోజనం వడ్డించారు. 
 
          కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్, జనసేన ఇంఛార్జి బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరందకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్ , టౌన్ అధ్యక్షులు లోగిశెట్టి స్వామి , మండల అధ్యక్షులు కాగిత వెంకటేశ్వర రావు , మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ , లంకె నారాయణ ప్రసాద్ , కొక్కిలిగడ్డ నాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *