MachilipatnamLocal News
March 11, 2026
మచిలీపట్నం

అంగన్వాడీ కేంద్రంలో మహిళా దినోత్సవం

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
అంగన్వాడీ కేంద్రంలో మహిళా దినోత్సవం
మచిలీపట్నం, 7మార్చి 2026, SSN:
 
       మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మిషన్ శక్తి స్కీమ్ సంకల్ప హబ్ ఆధ్వర్యంలో 20 రోజుల ఓరియంటేషన్ అవగాహన సదస్సులో భాగంగా శనివారం మచిలీపట్నం సర్కార్ తోట ఏరియానందు 2,3 సెంటర్ల లో మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 
        సర్కార్ తోట 2-3 సెంటర్ల అంగన్వాడి కేంద్ర పరిధిలోగల గర్భవతులను, బాలింతలను  సమావేశపరిచి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జి మాలతీదేవి మిషన్ శక్తి స్కీం కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృ వందన సెల్ఫ్ మదర్ హుడ్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది. వాయిదాలు ఏ విధంగా వస్తాయి అనే విషయాలపై అవగాహన కలిగించారు. 
         ఈ కార్యక్రమంలో జి మాలతి దేవితో పాటు అంగన్వాడీ టీచర్స్ టి పద్మ, ఆర్ వరలక్ష్మి, ఆయా పి వెంకటలక్ష్మి, గర్భవతులు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *