MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

ఏసీబీకి చిక్కిన విలేజ్ సర్వేయర్

  • January 30, 2026
  • 1 min read
[addtoany]
ఏసీబీకి చిక్కిన విలేజ్ సర్వేయర్
మచిలీపట్నం :
 
మచిలీపట్నంలో ఏసీబీ అధికారులకు 14వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్. మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు. పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేశారని, ఈ నేపథ్యంలో లంచం ఇవ్వటం కు ఇష్టపడని మచిలీపట్నం కు చెందిన రవీంద్రనాథ్ అనే బాధితుడి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు దాడి చేసి శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఎసీబీ డీఎస్పీ సుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *