అభివృద్ధికి ప్రతీకగా బందరును తీర్చిదిద్దుతా
SSN
- February 10, 2026
- 1 min read
[addtoany]
– ఇప్పటికే రూ.54 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం
– రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తొలి ప్రాధాన్యం
– మచిలీపట్నంలో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం :
మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి వీధికి, ప్రతి గ్రామానికీ మంచినీటి సదుపాయం, రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ నిధుల్లో రూ.90 లక్షలతో మంగినపూడి బీచ్ వద్ద, రూ.60 లక్షలతో పోతేపల్లి జ్యూవెలరీ పార్కు వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతేపల్లి జ్యూవెలరీ పార్కులోని పలు పరిశ్రమలు, షాపుల్లో కలియదిరిగారు. జ్యూవెలరీ తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. పోతేపల్లి జ్యూవెలరీ పార్కు మన అస్తిత్వానికి నిదర్శనం. అలాంటి కళను కాపాడుకోవడంతో పాటుగా, తగిన గుర్తింపు తీసుకు రావడం, పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడతానన్నారు.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.54 కోట్లు ఖర్చు చేశాం. రోడ్లు అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నాం. మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నందువలన జనాభా పెరుగుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. అదే సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా రోడ్లను పూర్తి చేశాం. డ్రైన్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
పోతేపల్లి జ్యూవెలరీ పార్కును మోడల్ పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలున్నాయి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ కవరింగ్ జ్యూవెలరీ పరిశ్రమలున్నప్పటికీ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ప్రధానంగా డ్రైనేజీ సమస్యల కారణంగా ఇక్కడ పని చేసే మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణంతో పాటుగా, డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లపై ఎక్కడా మురుగు నిలిచేందుకు ఆస్కారం లేకుండా చూడాలని, అవసరమైతే రోడ్డును ఎత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారి నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఆటోనగర్ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఏపీఐఐసీతో సంప్రదించి ఆటోనగర్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ ఏర్పాటు చేస్తాం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పటికీ గత ఐదేళ్ల నిర్లక్ష్యంతో ట్రాక్ పాడైంది. భవిష్యత్తులో మరింత సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తాను. మోడల్ పార్కుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు , డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ , గోపు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

