MachilipatnamLocal News
March 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ఆత్మవిశ్వాసం సడలిన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోంది – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు

  • March 4, 2026
  • 1 min read
[addtoany]
ఆత్మవిశ్వాసం సడలిన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోంది – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు
మచిలీపట్నం :
 
     అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ  వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల విద్యాసంస్థలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు స్థానిక మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్ నందు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్  వి.వి. నాయుడు  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ , నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
     విద్యార్థులకు వారి యొక్క ఆత్మ రక్షణ, భద్రత, ప్రమాదం సంభవించే సమయంలో తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, పట్టుదల ఏకాగ్రత తో ఎలా ముందుకు సాగాలి, వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరి ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించి చిన్నచిన్న టెక్నిక్స్ తో తమను తాము ఏ విధంగా రక్షించుకోవచ్చు తెలియజేశారు.
      ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ  ఆత్మరక్షణ అనేది కేవలం మన శరీరానికి సంబంధించిన అంశమే కాదని మానసికంగా మనలో దృఢత్వాన్ని పెంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వ్యవహరించడం, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే తక్షణమే పోలీసు, కుటుంబ సభ్యులు, బంధువుల కు సమాచారం అందించడం వంటివి చేయాలని అన్నారు.
     బాలికలు ఎంత దృఢంగా ఉంటే తమను తాము అంత ధైర్యంగా రక్షించుకోగలరని, ఆపద సంభవించే సమయంలో ఎవరో రక్షిస్తారని వేచి ఉండే కన్నా ముందుగానే తమను తామే రక్షించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు. చదువు మాత్రమే కాకుండా శారీరకృఢత్వాన్ని పెంపొందించుకొని సెల్ఫ్ డిఫెన్స్ పై పూర్తి పట్టు సాధిస్తే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా సునాయాసంగా తప్పించుకోగలరని తెలిపారు. 
 
మరీ ముఖ్యంగా నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలే అధికం. ముఖ పరిచయం లేని వ్యక్తుల వలన ప్రమాదాలు ఏ రూపంలోనైనా రావచ్చని కనుక ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని చెడు ఆకర్షణలకు లోనవ్వకుండా, ప్రతి ఒక్క విద్యార్థిని వారి యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకొని బలహీనతలను అధిగమించి, వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను తెలుసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని తెలిపారు.
 
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ  ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ లలో నిష్ణాతులైన వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించి, ఆకస్మాత్తుగా ఎవరైనా దాడి చేసిన తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి తెలియజేశారు. ఈ ఒక్క రోజే కాకుండా నిరంతరం సెల్ఫ్ డిఫెన్స్ ను అలవాటుగా మార్చుకొని సంపూర్ణ మహిళగా మారాలని పోలీసు అధికారులు తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *