MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పిన మహనీయుడు పుట్టపర్తి నారాయణాచార్యులు –– జిల్లా కలెక్టర్

  • March 28, 2026
  • 0 min read
[addtoany]
తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పిన మహనీయుడు పుట్టపర్తి నారాయణాచార్యులు –– జిల్లా కలెక్టర్
తెలుగు సాహిత్యానికి అపారమైన సేవలందించిన మహాకవి, పండితుడు, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు భాషా సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
 
శనివారం కవి, సాహిత్యవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
తెలుగు సాహిత్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన సాహిత్య వారసత్వాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కలెక్టరేట్ ఏవో రాధిక, కలెక్టరేట్ ఉద్యోగులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *