కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం చల్లపల్లిలోని నారాయణరావు నగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
10వ తరగతికి ప్రవేశించబోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిర్మాణ వాలంటీర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి, సరైన మార్గదర్శకత్వంతో చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
పర్యటనలో కలెక్టర్ వెంట మచిలీపట్నం డిప్యూటీ డిఇఓ బీఎస్సీ శేఖర్ సింగ్, చల్లపల్లి ఎంఈఓ 1 కే సుజాత, ఎంఈఓ 2 పి వెంకటేశ్వరరావు, విద్యార్థులు, స్థానిక అధికారులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.