MachilipatnamLocal News
March 30, 2026
పోలీస్ & లీగల్ డైరీ

రౌడీషీటర్లపై పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్: ఐ జి పి అశోక్ కుమార్

  • March 24, 2026
  • 0 min read
[addtoany]
రౌడీషీటర్లపై పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్: ఐ జి పి అశోక్ కుమార్

మచిలీపట్నం:

 
        మంగళవారం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లను ఐజీపీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళలపై దాడుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు.
      ఎస్పీ పి. విద్యాసాగర్ నేతృత్వంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. రౌడీషీటర్లపై స్పెషల్ నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు అని,
 పీడీ యాక్ట్ అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీపీ హెచ్చరించారు.
       ఈ తనిఖీల్లో ఐజీపీతో పాటు ఎస్పీ పి. విద్యాసాగర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *