MachilipatnamLocal News
March 30, 2026
కృష్ణా యూనివర్సిటీ

బోట్ తో కృష్ణా యూనివర్సిటీ అవగాహన ఒప్పందం

  • March 24, 2026
  • 0 min read
[addtoany]
బోట్ తో కృష్ణా యూనివర్సిటీ అవగాహన ఒప్పందం
మచిలీపట్నం: 
         కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ అనుబంధ సంస్థ బోర్డు ఆఫ్ ఏప్రింటిషిప్ ట్రైనింగ్ (చెన్నై) తో కృష్ణా విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం విశ్వవిద్యాలయ ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యములో వీసీ ప్రొఫెసర్ కె. రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బోట్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమణి రాజు లు అవగాహన ఒప్పంద పత్రాల పై సంతకాలు చేశారు. 
          ఈ ఒప్పందం ప్రకారం విద్యార్ధులకు అప్రెంటిషిప్ అవకాశాలు కల్పించడం తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా బోర్డు ఆఫ్ ఏప్రింటిషిప్ ట్రైనింగ్ సంస్థ కల్పించనుంది. విశ్వవిద్యాలయం లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఇదొక సదవకాశం అని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ హర్షం వ్యక్తం చేశారు. 
         ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం సమన్వయకర్త ఆచార్య వైకె. సుందరకృష్ణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ కిషోర్, విభాగ అధిపతులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *