[addtoany]
మచిలీపట్నం :
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి, విజిలెన్స్ ఎస్ డి సి పోతురాజు, మెప్మా పీడీ సాయి బాబు, డిఎస్పి శ్రీనివాసరావు లతో కలిసి తొలుత ఉద్యోగుల సమస్యల పరిష్కార దినం అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక…..మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
కలెక్టరేట్లో మొత్తం 9 అర్జీలు ప్రభుత్వ ఉద్యోగుల నుండి, 112 అర్జీలు ప్రజల నుండి జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
ఏలూరు జిల్లా కలిదిండి గ్రామస్తులు కలిదిండి వెంకటేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో అటెండర్గా పనిచేస్తున్నానని వచ్చే ఏప్రిల్ మాసంలో తాను పదవీ విరమణ పొందుతున్నానని, అలోగా తనకు బిల్ కలెక్టర్ పదోన్నతి కల్పించాలని కోరగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ కార్యాలయం పరిపాలన అధికారి సీతారామయ్యకు సూచించారు
మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు సనక పరిపూర్ణమ్మ (86) తన చిన్న కోడలు రామబాణం సహాయంతో చక్రాల కుర్చీలో కలెక్టరేట్ వద్దకు రాగా జిల్లా కలెక్టర్ వేదిక నుండి దిగి స్వయంగా ఆమె వద్దకు వచ్చి ఆమె భూ సమస్యను తెలియజేయగా ఎంతో ఓపికగా ఆలకించి డిఎస్పి శ్రీనివాసరావును పిలిపించి పోలీస్ కేసు నమోదు చేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీ ఆర్టీసీ కాలనీకి చెందిన గుడివాడ ధర్మారావు తాను వృద్ధాప్యంలో ఉన్నానని, తన కుమారుడు బసవేశ్వరావు తనను పట్టించుకోవడంలేదని, తన ఆస్తిని అమ్ముకొనుటకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేస్తూ తన కుమారునికి ఎలాంటి పత్రాలు లేకపోయినా అతని పేరిట పన్ను వస్తుందని, ఆ పన్నులను తాను చెల్లిస్తున్నానని ఈ విషయం సచివాలయం సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఇకనైనా పన్ను నోటీసులో తన పేరు వచ్చేలా మార్పు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి ,బిసి కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డ్వామా, డిఆర్డియే పి డి లు శివప్రసాద్, హరిహరనాథ్, డిపిఓ అరుణ జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డిఐసి జీఎం వెంకటరావు, డిఇఓ సుబ్బారావు, మచిలీపట్నం ఇన్చార్జి డిఎస్పీ ధర్మేంద్ర తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

