ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 77 మంది గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ -3 గా పదోన్నతులు కల్పించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ డి. కె బాలాజీ చేతుల మీదగా పదోన్నతుల ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా లో వివిధ మండలాల్లో పని చేస్తున్న గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శులకు సీనియారిటీ ప్రకారం 77 మంది అర్హత పొందగా వారందరికీ పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదోన్నతి బాధ్యత మరింత పెంచుతుందని ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి తదనుగుణంగా లక్ష్యాలు అందుకునే దిశగా సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు. పదోన్నతులు పొందిన అర్హులకు జిల్లా పంచాయతీ అధికారి డా. జె. అరుణ అభినందనలు తెలియజేసారు. అనంతరం నూతనంగా పదోన్నతులు పొందిన కార్యదర్శులు అంగన్వాడీ కేంద్రాల్లోన్ని చిన్నారులకు రంగు పెన్సిల్స్ (క్రేయన్స్ ) వితరణగా అందజేశారు.