వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం తరపున ఏర్పాటు చేసిన చలివేమంచినీటి చలివేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ ప్రారంభించారు. వివిధ రకాల పనుల నిమిత్తం కలెక్టరేట్కు విచ్చేసే ప్రజలకు వేసవి ఎండ కారణంగా దాహార్తిని తీర్చేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది
సంయుక్త కలెక్టర్ చలివేంద్రంలోని మంచినీటిని స్వయంగా సేవించడంతోపాటు డీసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణకు కూడా మంచినీరు అందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, కలెక్టరేట్ ఏవో రాధిక, పలువురు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.