MachilipatnamLocal News
March 11, 2026
కృష్ణా యూనివర్సిటీ

వ్యాయామం సర్వరోగనివారిణి: కెయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు

  • March 11, 2026
  • 1 min read
[addtoany]
వ్యాయామం సర్వరోగనివారిణి: కెయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు
మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
          నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కనీసం అర్థగంట వ్యాయామం చేయడం అవసరమని, అలా చేయకపోతే ఎన్ని లక్షలు ఉన్నా ఎవరు కాపాడలేరని కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ ఇండోర్ స్టేడియం లో అంతర్ విశ్వవిద్యాలయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు, కృష్ణా విశ్వవిద్యాలయం జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
        ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులే నిజమైన ఆరోగ్యవంతులు అని, వారిని చూసి తమ జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 
        అనంతరం బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు. తదుపరి కృష్ణా విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.గోపి, తైక్వాండో రిఫరీ లు, పలు కళాశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ లు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *