MachilipatnamLocal News
March 11, 2026
Uncategorized

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ

  • March 10, 2026
  • 1 min read
[addtoany]
అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ
మచిలీపట్నం, 10 మార్చి 2026, SSN:
        యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసే వ్యవస్థలపై ఉక్కు పాదం మోపుతామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లో గంజాయి తరలిస్తూ పట్టుబడిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
      యువత గంజాయి మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హితవు పలికారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి చెందిన మనబోటి ఈశ్వర ప్రసాద్, తమిళనాడుకు చెందిన దురై మోహన్ కుమార్, విశాఖపట్నంకి చెందిన అల్లా అమీన్ లు గతంలో తమిళనాడు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో స్నేహితులుగా మారి, సులభ పద్ధతిలో డబ్బును సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి సరఫరాను ఎంచుకున్నారన్నారు. 
        నిందితులు ముగ్గురు కలిసి 52 కేజీల గంజాయి 26 ప్యాకెట్లుగా పార్సిల్ చేసి కారులో తరలిస్తున్న క్రమంలో తోట్లవల్లూరు ఎస్సై పి కిషోర్ నేతృత్వంలోని సిబ్బంది అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల అరవై వేల మేర ఉంటుందని తెలిపారు. 
         గంజాయి సరఫరాకు వినియోగించిన కారు నిందితులకు చెందిన మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు వెల్లడించారు. యువతను మత్తుపదార్థాలకు బానిసలు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు.గంజాయిని తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తోట్లవల్లూరు పోలీస్ సిబ్బందిని అభినందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *