మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:
కృష్ణా జిల్లా మచిలీపట్నం పోస్టల్ డివిజన్ పరిధిలోని జువెలరీ పార్క్‌లో “ఐ.జె. పార్క్ సబ్ పోస్ట్ ఆఫీస్” ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఆధునిక సేవలను అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా జువెలరీ పార్క్‌లో ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారులు తమ పార్సిళ్లను తక్కువ దూరంలోనే, తక్కువ ఖర్చుతో పోస్టల్ సేవల ద్వారా పంపించుకునే సౌకర్యం కల్పించడమే ఈ పోస్ట్ ఆఫీస్ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాసరావు, పోస్టల్ సిబ్బంది, జువెలరీ పార్క్ ఎం.డి. చలమలశెట్టి ప్రసాద్, జువెలరీ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీవీ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ మట్ల శ్రీను, సెక్రటరీ అంకెం జితేంద్ర, జాయింట్ సెక్రటరీ ఆర్.బి. రహమతుల్లా బేగ్, ట్రెజరర్ ఎన్.వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.