మచిలీపట్నం, 8 మార్చి 2026, SSN:
చిత్రకళ తపస్వి, ప్రముఖ చిత్రకారుడు, కళాకారుడు దామర్ల రామారావు జన్మదిన సందర్భంగా మచిలీపట్నంలో ఆదివారం సన్ స్టార్ పాఠశాలందు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ కే రాంజీ, రిజిస్టర్ ఉషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతలు గాంచిన పలువురిని ఘనంగా సత్కరించారు.
ప్రముఖ కథ, నవల రచయిత, ఆంధ్రప్రభ మచిలీపట్నం స్టాఫ్ రిపోర్టర్ నందం రామారావు ను కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కే రాంజీ , కృష్ణా యూనివర్సిటీ రిజిస్టర్ ఎన్ ఉష లు పూలమాల, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురు విలేకరులు, మిత్రులు, అభిమానులు నందం రామారావు ను పూలమాలలతో, శాలువాలతో అభినందన పూర్వకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో నిష్ణాణుతులైన ఆర్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కే మృత్యుంజయరావు, ఆర్ట్ టీచర్ మృత్యుంజయరావు, జడ్పీహెచ్ఎస్ కృతివెన్ను ఉపాధ్యాయురాలు స్వర్ణలత, జడ్పీహెచ్ఎస్ గూడూరు అరుణ లను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కే రాంజీ , రిజిస్టర్ ఉషాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ చీఫ్ కెమెరామెన్ నందం శ్రీనివాస్, నాగేశ్వరమ్మ, లక్ష్మీ కుమారి, ఉషా, లక్ష్మి, రాంబాబు, సత్యదేవ్, నూకరాజు శర్మ, మోహన ప్రియ తదితరులు పాల్గొన్నారు.