MachilipatnamLocal News
March 14, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం వైస్ మెన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
మచిలీపట్నం వైస్ మెన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’
మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:
 
         స్థానిక మచిలీపట్నం క్లబ్, వైస్ మెన్ ఇంటర్నేషనల్ అజ్మీర్ బాబా సేవ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి సయ్యద్ బాజి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యతను సమాజంలో వారి పాత్రను కొనియాడారు. ​సేవా కార్యక్రమంలో భాగంగా తొలుత సయ్యద్ పీర్, క్లబ్ సభ్యులు, సమాజ సభ్యులు కలిసి ఇందిరా గాంధీ, సరోజినీ నాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
        అనంతరం ‘అన్నపూర్ణ వృద్ధాశ్రమం’లో ఉన్న వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ.. మహిళ లేనిదే సమాజం లేదని, సమానత్వం, సాధికారత విముక్తి కోసం పోరాడిన మహిళామూర్తులను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. సుమారు 1400 ఏళ్ల క్రితమే మహ్మద్ ప్రవక్త తన సందేశంలో మహిళలపై వివక్ష చూపరాదని, తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని బోధించారని గుర్తుచేశారు. మహిళా చైతన్యం మన ఇళ్ల నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.​
        ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు, డాక్టర్ నాగేశ్వరరావు, సుబ్బారావు, నితిన్, అల్లాఉద్దీన్, ఇస్మాయిల్, షేర్ అలీ, కేదారి మరియు ఇతర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “అందరూ మహిళలను గౌరవించాలి” అనే నినాదంతో కార్యక్రమం ముగిసింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *